Tuesday, October 20, 2009

నా ప్రాణమా....

ప్రతి క్షణం నీతోనే గడపాలనీ...
అనుక్షణం నీ పలుకులే నా ఎద సవ్వడి కావాలనీ
నీ నవ్వుల వెలుగులో నేను సమయం గడపాలనీ
కనుపాపవలె నిన్నుప్రతి నిమిషం కాపాడాలనీ
నీ నీడనై నేను నీలో కలిసిపోవాలనీ
నిజమైన ప్రేమకు నిలువెత్తు సాక్షం అయిన నీ ఒడిలో నేను మరణించాలనీ
ఇలా ఎన్నో ఆశలు ఊయలలు ఊగుతుంటే ఒక్కటైనా నీకు తెలియలేదా ప్రియతమా....

తీయని పరిచయాలు ఎన్ని ఉన్నా నీ పరిచయంలో కొత్త ఉదయాన్ని చూస్తున్నాను 

అరక్షనమైనా నిన్ను చూడక ఉండలేనంటున్ననా హృదయానికి బదులివ్వలేక పోతున్నాను...
నిత్యం నీ ధ్యాసలో అలిసిపోతున్ననా మనసుకి విశ్రాంతిని ఎన్నడివ్వను

నమ్మకం లేని ప్రేమకు అర్ధం లేదని నేను నీకు ఎలా చెప్పను
నా ప్రేమకు సాక్షాలు ఎన్నని చూపను..
నా ప్రేమను స్వాగతించి మౌనంగా రోదించే నా మనసు కన్నేరుని తుడిచేస్తావో లేక
బదులివ్వక నా జీవితాన్ని మరణానికి చిరునామా చేస్తావో..
నీ హృదయానికే వదిలి ఎప్పటిలాగే ఎదురుచూస్తున్నాను నా ప్రాణమా..!

Tuesday, August 18, 2009

నీకే జన్మించాలని నేను కోరుకుంటున్నా...

అమ్మ..!

కనులు తెరిచిన తరువాత నా గుండెలలో నీ ఊపిరి నింపుకుని పలికిన మొదటి మాట అదే కదా
నాకు ప్రాణం పోయటానికి నవ మాసాలు భారాన్ని భరించింది నీవే కదా

ఎంత బాధ కలిగినా నీ ఊపిరిని నాకు పంచావు
నీ రక్తాన్ని పంచి నాకు జన్మనిచ్చావు

అమ్మ ..అని నేను పిలిచినపుడు నీ కనులలో ఆనందాన్ని చూసాను
ప్రేమతో నీ ఒడిలో నన్ను నిదురపుచ్చినప్పుడు నా ప్రతి బాధను మరిచాను

నీవు నాకోసం పాడిన లాలిపాటలో మాధుర్యం
నీవు తినిపించిన అమ్మ ముద్దలో కమ్మదనం
నన్ను ముద్దాడినపుడు నీ ప్రేమలో తల్లి ప్రేమ తియ్యదనం
అన్నింటినీ రుచి చూసాను

రాత్రి వేళ ఇరువురం స్నేహితులమై ఊసులాడుకున్న క్షణాలను
నా ఆనందం కోసం నీవు నాతో ఆడుకున్న మధుర నిమిషాలను

నా కంట కన్నీరును చూసి తల్లడిల్లిన నీ తల్లి మనసును నేను మరువలేనమ్మా
అమ్మ .. అను మాట కన్నా తీయనైన మాట జగాన ఎమున్నదమ్మా

పేగుబంధం కన్నా మరో గొప్ప బంధమే ఎరుగని నేను
ఏమిచ్చి తీర్చుకోగలనమ్మా నీ రుణాన్ని...

అందుకే అమ్మ .. అమూల్యమైన నీ ప్రేమని పొందటానికి
ఎన్ని సార్లైనా మరణించి నీకే జన్మించాలని నేను కోరుకుంటున్నా..

..@సుధి ...

Tuesday, July 28, 2009

చూపవద్దనీ...

మేఘాన్ని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్న క్షణం వర్షించాలని
నా మనసు నిన్ను పోందలేకపోతున్న బాధ నా కన్నీరుగా నీకు చూపవద్దనీ....
..@సుధి

Friday, July 3, 2009

గుండె గొంతులో ఉన్న నిజం నే చెప్పగలనా నీకు
మాటేరాని మనసుకు మౌనమెందుకో...
చూడలేని నా కనులకు నీ రూపమే చూపు అనీ
బదులివ్వలేని నా పెదవికి పలుకు నేర్పింది నీవనీ

ఎలా చెప్పనమ్మా ప్రియతమా....

నీ తోడు లేక ఒక క్షణం నిలువనంటుంది నా ప్రాణం
కంట తడినే చూస్తున్నవి నా కళ్లు నీ చెలిమి లేక ప్రతి క్షణం ...
భారమైన యెదకి బదులు నే చెప్పలేకపోతున్నా....
నా గుండె గుడిలో ఉన్న దేవత నీవని ఎలా తెలుపనమ్మా

ఎలా చెప్పనమ్మా ప్రియతమా ...

దేహం ప్రతి అణువు నీ రూపు దాచుకున్నా
ఒంటరినై నే ఇక జీవించ లేకున్నా ...
నీ తోడు కొత్త చూపు నిచ్చిన్నా
నీతో బ్రతకాలన్న ఆశ శాపంగా మారుతుంటే
కనులులేని నేను మాటాడలేక మరణిస్తున్నా....

ఎలా చెప్పగలను ప్రియతమా...

Thursday, March 19, 2009

మరణంతో చెలిమి చేసి...

కలగా కదిలేను నీ రూపం నా కనుల మాటున
అలగా సాగి నా హృదయ తీరాలను తాకెను నా మది చాటున
వర్షించే మేఘమై నీ సంతోషం చిరునవ్వుల జల్లులను కురిపిస్తుంటే
నీ నీడనై సిరివెన్నలలో నవ్వు చుడాలనుకున్నా
ప్రేమ సాగర తీరాన నీతో కలిసి నడవాలనుకున్నా
ప్రతి క్షణం నీకు తోడుగా జీవించాలని ఆశగా కోరుకున్నా

నీకోసం నేను వేసిన ప్రతి అడుగుని అడుగు
మరువలేని నీ రూపాన్నే చూపిస్తాయి
ఇంక పలుకలేనంటున్ననా పెదవులని అడుగు
నీ పేరునే మరల మరల జపిస్తాయి
శ్వేత వర్ణాన్ని మరిచి రక్తంతో చెలిమి చేసిన నా నయనాలని అడుగు
విడువలేని నీ ప్రతిబింబాన్ని చూపెడుతాయి
నమ్మక నీవు చూసే చూపు నా యెద కోవేలలోకి చూడు
మూర్తి వై ఉన్నది నీవే అని గుడి గంటలు ప్రతిధ్వనిస్తాయి

వీటి కన్నా సాక్ష్యంగా ఏమి చూపగలను నీకు
నీకోసమే జీవించే నా ప్రాణం కన్నా ఏమి ఇవ్వగలను నీకు

నీ పిలుపు కోసం నిరీక్షణలో ఆకలన్నది మరిచాను
ఆపని నీ అన్వేషణలో నన్ను నేనే మరిచాను
నిమిషమైన ఇక నేను నిలువలేకున్నా
నా శ్వాసతో చెలిమికి నేను ఇక దూరమవుతున్నా
ఆయువు ఉండి నా ప్రేమ గెలుపుని చాటలేక
మరణంతో చెలిమి చేసి నా ఓటమిని చాటుతున్నా ప్రియతమా...!

Tuesday, March 17, 2009

ఒంటరినై ఒక్కడినై...

క్షణ క్షణం ప్రతిక్షణం
అన్నీ విడిచి అందరినీ వదిలి
అమ్మ అను మాట అనాధను చేయకున్నా
నాన్న పంచిన ప్రేమ అన్నీ నేర్పినా, నేడు
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం...
స్నేహం కొత్త ఊపిరినిచ్చినా
అప్పుడప్పుడు మనసు నీవెవరని ప్రశ్నించినా
గతం చేసిన గాయాలను మరిచి
నా ఉనికిని చాటేందుకు ఆశల ఊపిరి నింపుకుని
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం...
అలసి సొలసి బ్రతుకు తెరువు కోసం
వెతికి వెతికి ఒక సాయం కోసం
గుండెల్లో బాధని బంధించి కళ్ళలో కన్నీళ్ళను దాచి
గతం తాలూకు జ్ఞాపకాలను వదిలి
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం..
ప్రతి ఉషోదయం నన్ను ప్రశ్నిస్తున్నా
అస్తమించే రవి నన్ను వెక్కిరిస్తున్నా
అలుపు అన్నది ఎరుగక నిరాశను దరికి రానివ్వక
ఓరిమి అన్నది విడువక ఆశయం వైపు చూస్తూ
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవతాన అన్నసూక్తి మరువక
ఒంటరినై... ఒక్కడినై.. చేస్తున్నా...ఈ జీవన ప్రయాణం......

Monday, December 22, 2008

సొంతం....

పలికే ప్రతి మాట పెదవికి సొంతం కాదు..
కనుల మాటున కదిలే ప్రతి స్వప్నం కనులకు సొంతం కాదు
మరపురాని మరువలేని మధురానుభూతులు మదికి మాత్రం సొంతం నేస్తమా...!

....@సుధి