Monday, December 22, 2008

సొంతం....

పలికే ప్రతి మాట పెదవికి సొంతం కాదు..
కనుల మాటున కదిలే ప్రతి స్వప్నం కనులకు సొంతం కాదు
మరపురాని మరువలేని మధురానుభూతులు మదికి మాత్రం సొంతం నేస్తమా...!

....@సుధి

ఒక క్షణం...

"క్షణం" జీవించడానికి ఓ క్షణం చాలునేమో నేస్తమా ...
కానీ..
మాటల్లో తెలుపలేని నీ స్నేహాన్ని ఆనందించటానికి నాకు ఎన్ని క్షణాలైనా సరిపోవు నేస్తమా...!

...@సుధి

స్నేహమే శాశ్వతం.....

చూసే నయనాల వెంట కన్నీళ్ళు
మాట్లాడే పెదవులపై చిరునవ్వులు
స్పందిచే హృదయానికి కలతలు
ఇవేవీ కాదు శాశ్వతం ...
మది మదినీ తాకి మధుర జ్ఞాపకమై మురిపించే స్నేహమే శాశ్వతం.....


....@సుధి

మన స్నేహం చెరిగిపోకూడదని....

ఎన్ని జన్మల తపస్సుకు ఫలితమో
ఎన్ని వేళ కన్నీటి బిందువులకు అర్ధమో
నీ చెలిమి నాకు తోడైంది నేస్తమా...
ఒంటరి నా కదలికకు నీవు జత అయినావు
బాధ అనే భారాన్ని నువ్వూ పంచుకున్నావు
ఏది గమ్యమో తెలీదు
ఎంత దూరమో తెలీదు
అలసిన నా మనసులో కొత్త ఆసలు రేపావు
నీ స్నేహం తో మరల ఊపిరి నిచ్చావు
నువ్వు ఉన్నావనే ఒక్క అనుభూతే నాలో ఆసలకు జీవం
ఎప్పుడు అంతమవుతుందో తెలియదు ఈ స్నేహ ప్రయాణం....
గడచిన క్షణాలు తిరిగి రావని తెలుసు...
అవి చెరగని జ్ఞాపకాలుగా మదిలో మిగిలిపోతాయని తెలుసు..
నా ఆంక్షలు ఏమని తెలుపను నేస్తమా..?
నీ స్నేహమే నా ప్రతిజన్మలో కావాలని ..
నా తుది శ్వాస వరకు నీవు నా తొడు ఉండాలని ...
ఆ క్షణం నీ పిలుపే మరల నాకు ప్రాణం పోయాలని ...
అందుకే నీ స్నేహం తో పునీతమైన నా మనసు చెప్తోంది ..,
స్నేహమనే మాటకు అర్ధమే నీవనీ
నేను మరణించినా మన స్నేహం చేరిగిపోకూడదని...

....@సుధి



ప్రతిరూపం నువ్వు కనుక..

నిన్ను మరువనని నా మది చెప్తుంది
నిన్ను వీడిపోనని నా శ్వాస అంటుంది
ఎందుకో తెలుసా నా ప్రియ నేస్తమా..
స్నేహానికి సాక్ష్యం నీవు గనుక
అసలు సిసలైన చెలిమికి ప్రతిరూపం నువ్వు కనుక..

....@సుధి

...స్నేహం...

రెండక్షరాల అద్భుతం స్నేహం
నిండు హృదయాల అనుబంధం స్నేహం
మనసుల మధుర కలయిక స్నేహం
కనులముందు మెదిలే ఓ తీయని జ్ఞాపకం స్నేహం
అనురాగాల అలలతో పయనించు అందాల నావ స్నేహం
నిత్యం సత్యమైన ప్రేమకు పునాది స్నేహం
ప్రజ్వలించే ఓ రవి కిరణం స్నేహం
చల్లని వెన్నెల జాబిలి స్నేహం
జన్మ జన్మల ఓ తపస్సు స్నేహం
స్వచ్చమైన హృదయ స్పందన స్నేహం
నిత్యం ప్రకాశించు ఓ వెలుగు స్నేహం అనంతమైన భువిలో అంతమే లేనిది స్నేహం....

....@సుధి

ఓ నేస్తం...

ఈ కవిత నా ప్రాణ స్నేహితులకు అంకితం..

నేస్తం..!
ఉదయించే సూర్యుడివి నీవైతే ప్రజ్వలించే కాంతి నేను
కుసుమించే పుష్పానివి నీవైతే నీలో నిలిచిపోయిన మధుర మకరందం నేను
మధుర స్వరాలు ఆలపించే కోకిల నీవైతే స్వరాలనందుకొనే పాటను నేను...
కురిసే చిరు చినుకు నీవైతే అందుకునే పసిడి నేలను నేను
అస్తమించే రవి నీవైతే నిను సేదతీర్చ వచ్చిన జాబిలిని నేను
స్నేహం మరువలేనిది గనుకే వీడిపోని ప్రాణ స్నేహితులం మనము....

....@సుధి

నీలో ఊపిరిగా..

కనులు ప్రేమించు నీ కలల సాక్షిగా
పెదవులు ప్రేమించు నీ నవ్వుల సాక్షిగా
నిన్ను ప్రేమించే నా మనసు సాక్షిగా
నీ నీడనై తోడుంటాను ...
నీలో ఊపిరిగా జీవిస్తాను ప్రియతమా...

...సుధి

ఓ ప్రియా...

ఓ ప్రియా....!
నిర్మల నీలి కన్నుల నీ సోయగాలు మధురం
నీ చిరు పెదవులు కురిపించు నవ్వుల వెన్నెల మధురం
అలలవలె పరుగులు తీసే నీ కోమల పాదాలు మధురం
పసిడి కాంతులీను నీ మేని ఛాయ మధురం
నా మనసుతో దోబూచులాడు నీ మనోహర రూపం మధురం
నిను చూసి మాటరాక నిలిచిపోయిన ఆ క్షణం మధురం
నిన్ను చూడాలని తపించు నా యెద అలజడి మధురం
నీకోసం నీరిక్షణలో తలచే ఆ తలపు మధురం
నా తోడు నీడ నీవై ఉండాలని నిలుస్తావన్న ఆ ఆశమధురం
మధురమైన ప్రేమ సాక్షిగా ఈ జగాన మిగిలిపోవు మన శాశ్వత అనుబంధం మధురం మృదు మధురం.......

......@సుధి

Sunday, December 21, 2008

నీ రూపం...

నిన్న చూసిన నీ రూపం నా యెదలో నిలిచిపోయింది
మరువలేని మధుర స్వప్నమై నా కనులలో కదలాడుతున్నది
ఎన్నాల్లో తెలియని ఈ నిరీక్షణతో నా హృదయం కలవరపడుతున్నది ....
క్షణమొక యుగమై కదలాడుతుంటే నా హృదయం ఓర్వలేక సంద్రమై నా కన్నుల ప్రవహిస్తున్నది...
ఇకనైనా కనిపించి నా శ్వాస నిలుపవా ప్రియతమా....

....@సుధి

నీ ప్రేమకు రుణంగా..

కనుల చాటున నా కన్నీళ్ళని కలలుగా చేసావు
నీ సంతోష సంద్రాలలో జీవచ్చవమైన నా మనసును ఆరాధించావు
ఏమివ్వగలను నీ ప్రేమకు రుణంగా నీకోసం ప్రతిక్షణం తపించే నా ప్రాణం తప్ప ......

....@సుధి

ఏమని చెప్పను...

కాగితాల కలలలో కన్నీటి అక్షరాలు నా అనుభవాలు
ఒక రక్త సిందూరానికి సాక్షి నా జ్ఞాపకాలు...
ఎన్నని చెప్పను ఏమని చెప్పను నా ప్రేమ చేసిన గతం తాలూకు మాయని గాయాలు ...

Friday, October 31, 2008

మీకోసం ఈ నా హృదయం.....

ప్రతిక్షణము ఆలోచించే హృదయం అలజడే " నా హృదయం "