Monday, December 22, 2008

మన స్నేహం చెరిగిపోకూడదని....

ఎన్ని జన్మల తపస్సుకు ఫలితమో
ఎన్ని వేళ కన్నీటి బిందువులకు అర్ధమో
నీ చెలిమి నాకు తోడైంది నేస్తమా...
ఒంటరి నా కదలికకు నీవు జత అయినావు
బాధ అనే భారాన్ని నువ్వూ పంచుకున్నావు
ఏది గమ్యమో తెలీదు
ఎంత దూరమో తెలీదు
అలసిన నా మనసులో కొత్త ఆసలు రేపావు
నీ స్నేహం తో మరల ఊపిరి నిచ్చావు
నువ్వు ఉన్నావనే ఒక్క అనుభూతే నాలో ఆసలకు జీవం
ఎప్పుడు అంతమవుతుందో తెలియదు ఈ స్నేహ ప్రయాణం....
గడచిన క్షణాలు తిరిగి రావని తెలుసు...
అవి చెరగని జ్ఞాపకాలుగా మదిలో మిగిలిపోతాయని తెలుసు..
నా ఆంక్షలు ఏమని తెలుపను నేస్తమా..?
నీ స్నేహమే నా ప్రతిజన్మలో కావాలని ..
నా తుది శ్వాస వరకు నీవు నా తొడు ఉండాలని ...
ఆ క్షణం నీ పిలుపే మరల నాకు ప్రాణం పోయాలని ...
అందుకే నీ స్నేహం తో పునీతమైన నా మనసు చెప్తోంది ..,
స్నేహమనే మాటకు అర్ధమే నీవనీ
నేను మరణించినా మన స్నేహం చేరిగిపోకూడదని...

....@సుధి



No comments: