Tuesday, August 18, 2009

నీకే జన్మించాలని నేను కోరుకుంటున్నా...

అమ్మ..!

కనులు తెరిచిన తరువాత నా గుండెలలో నీ ఊపిరి నింపుకుని పలికిన మొదటి మాట అదే కదా
నాకు ప్రాణం పోయటానికి నవ మాసాలు భారాన్ని భరించింది నీవే కదా

ఎంత బాధ కలిగినా నీ ఊపిరిని నాకు పంచావు
నీ రక్తాన్ని పంచి నాకు జన్మనిచ్చావు

అమ్మ ..అని నేను పిలిచినపుడు నీ కనులలో ఆనందాన్ని చూసాను
ప్రేమతో నీ ఒడిలో నన్ను నిదురపుచ్చినప్పుడు నా ప్రతి బాధను మరిచాను

నీవు నాకోసం పాడిన లాలిపాటలో మాధుర్యం
నీవు తినిపించిన అమ్మ ముద్దలో కమ్మదనం
నన్ను ముద్దాడినపుడు నీ ప్రేమలో తల్లి ప్రేమ తియ్యదనం
అన్నింటినీ రుచి చూసాను

రాత్రి వేళ ఇరువురం స్నేహితులమై ఊసులాడుకున్న క్షణాలను
నా ఆనందం కోసం నీవు నాతో ఆడుకున్న మధుర నిమిషాలను

నా కంట కన్నీరును చూసి తల్లడిల్లిన నీ తల్లి మనసును నేను మరువలేనమ్మా
అమ్మ .. అను మాట కన్నా తీయనైన మాట జగాన ఎమున్నదమ్మా

పేగుబంధం కన్నా మరో గొప్ప బంధమే ఎరుగని నేను
ఏమిచ్చి తీర్చుకోగలనమ్మా నీ రుణాన్ని...

అందుకే అమ్మ .. అమూల్యమైన నీ ప్రేమని పొందటానికి
ఎన్ని సార్లైనా మరణించి నీకే జన్మించాలని నేను కోరుకుంటున్నా..

..@సుధి ...