Monday, December 22, 2008

...స్నేహం...

రెండక్షరాల అద్భుతం స్నేహం
నిండు హృదయాల అనుబంధం స్నేహం
మనసుల మధుర కలయిక స్నేహం
కనులముందు మెదిలే ఓ తీయని జ్ఞాపకం స్నేహం
అనురాగాల అలలతో పయనించు అందాల నావ స్నేహం
నిత్యం సత్యమైన ప్రేమకు పునాది స్నేహం
ప్రజ్వలించే ఓ రవి కిరణం స్నేహం
చల్లని వెన్నెల జాబిలి స్నేహం
జన్మ జన్మల ఓ తపస్సు స్నేహం
స్వచ్చమైన హృదయ స్పందన స్నేహం
నిత్యం ప్రకాశించు ఓ వెలుగు స్నేహం అనంతమైన భువిలో అంతమే లేనిది స్నేహం....

....@సుధి

No comments: