Thursday, March 19, 2009

మరణంతో చెలిమి చేసి...

కలగా కదిలేను నీ రూపం నా కనుల మాటున
అలగా సాగి నా హృదయ తీరాలను తాకెను నా మది చాటున
వర్షించే మేఘమై నీ సంతోషం చిరునవ్వుల జల్లులను కురిపిస్తుంటే
నీ నీడనై సిరివెన్నలలో నవ్వు చుడాలనుకున్నా
ప్రేమ సాగర తీరాన నీతో కలిసి నడవాలనుకున్నా
ప్రతి క్షణం నీకు తోడుగా జీవించాలని ఆశగా కోరుకున్నా

నీకోసం నేను వేసిన ప్రతి అడుగుని అడుగు
మరువలేని నీ రూపాన్నే చూపిస్తాయి
ఇంక పలుకలేనంటున్ననా పెదవులని అడుగు
నీ పేరునే మరల మరల జపిస్తాయి
శ్వేత వర్ణాన్ని మరిచి రక్తంతో చెలిమి చేసిన నా నయనాలని అడుగు
విడువలేని నీ ప్రతిబింబాన్ని చూపెడుతాయి
నమ్మక నీవు చూసే చూపు నా యెద కోవేలలోకి చూడు
మూర్తి వై ఉన్నది నీవే అని గుడి గంటలు ప్రతిధ్వనిస్తాయి

వీటి కన్నా సాక్ష్యంగా ఏమి చూపగలను నీకు
నీకోసమే జీవించే నా ప్రాణం కన్నా ఏమి ఇవ్వగలను నీకు

నీ పిలుపు కోసం నిరీక్షణలో ఆకలన్నది మరిచాను
ఆపని నీ అన్వేషణలో నన్ను నేనే మరిచాను
నిమిషమైన ఇక నేను నిలువలేకున్నా
నా శ్వాసతో చెలిమికి నేను ఇక దూరమవుతున్నా
ఆయువు ఉండి నా ప్రేమ గెలుపుని చాటలేక
మరణంతో చెలిమి చేసి నా ఓటమిని చాటుతున్నా ప్రియతమా...!

1 comment:

Unknown said...

chala bagunnay sudhendra