Tuesday, March 17, 2009

ఒంటరినై ఒక్కడినై...

క్షణ క్షణం ప్రతిక్షణం
అన్నీ విడిచి అందరినీ వదిలి
అమ్మ అను మాట అనాధను చేయకున్నా
నాన్న పంచిన ప్రేమ అన్నీ నేర్పినా, నేడు
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం...
స్నేహం కొత్త ఊపిరినిచ్చినా
అప్పుడప్పుడు మనసు నీవెవరని ప్రశ్నించినా
గతం చేసిన గాయాలను మరిచి
నా ఉనికిని చాటేందుకు ఆశల ఊపిరి నింపుకుని
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం...
అలసి సొలసి బ్రతుకు తెరువు కోసం
వెతికి వెతికి ఒక సాయం కోసం
గుండెల్లో బాధని బంధించి కళ్ళలో కన్నీళ్ళను దాచి
గతం తాలూకు జ్ఞాపకాలను వదిలి
ఒంటరినై ఒక్కడినై చేయగలనా జీవన ప్రయాణం..
ప్రతి ఉషోదయం నన్ను ప్రశ్నిస్తున్నా
అస్తమించే రవి నన్ను వెక్కిరిస్తున్నా
అలుపు అన్నది ఎరుగక నిరాశను దరికి రానివ్వక
ఓరిమి అన్నది విడువక ఆశయం వైపు చూస్తూ
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవతాన అన్నసూక్తి మరువక
ఒంటరినై... ఒక్కడినై.. చేస్తున్నా...ఈ జీవన ప్రయాణం......